:ఇట్స్ ట్రూ న్యూస్:
షాపులకు వెళ్ళాలి అంటె ముక్కు మూసుకోవాల్సిందే
ఇట్స్ ట్రూ న్యూస్ /జ్యోతి నగర్
రోడ్డుపై నడవాలన్న షాప్స్ కు వేళ్ళాలి అంటే ముక్కు మూసుకోవాల్సిందే తప్పదు .ఎన్టిపిసి రామగుండం ఎఫ్సిఐ క్రాస్ రోడ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుండి వ్యర్థపు నీరు బయటకు రావడంతో మురుగునీరు పారి దుర్వాసన వస్తుంది మురుగునీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో తినుబండారాల దుకాణాలు పళ్ళ దుకాణాలు ఉండటంతో కొనుగోలుదారులు ముక్కలు మూసుకొని ఇదేంటి దుర్వాసన అని అసహనం వ్యక్తం చేస్తూ కోనేవారు కోనడంలేదు.ఎదైన తిని వద్దామని ముక్కు ముసుకొని వెళ్ళిన ఆ వాసనకు తిన్నది బయటికి వస్తుంది చాల మంది వార్మిటింగ్ చేసుకొన్నారు. ఇది మన రామగుండం నగరపాలక సంస్థ అని ముక్కున వేలేసుకుంటున్నారు. సంబంధిత విభాగపు అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు