రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవాలి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్
రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని రామగుండం తహశీల్దారు కుమార స్వామి తెలిపారు.రామగుండం మున్సిపల్ పరిధిలోని 3వ డివిజన్ మేడిపల్లి గ్రామ రైతువేదికలో గురువారం సంక్షేమ పథకాలు, పౌరహక్కులు, వాటి విధివిధానాలపై ప్రజలు అవగాహన కల్పించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రతినెలా 30న మండల కేంద్రాల్లో సివిల్‌రైట్స్‌డే నిర్వహిస్తున్నమని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకొంటే ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం అందుతుందని అన్నారు.ఎస్ సి,ఎస్టీ,బిసిలలో ఉన్నత చదువులు విదేశాల్లో చదువుకునేవారికి ప్రభుత్వం సహాయం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాముగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రకాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) వినోద్, ,సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సాయి కుమార్, కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్,3వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదునూరి మల్లేష్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రహీం , అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్,కాంపెల్లి సతీష్, నాయకులు తది తరులు పాల్గొన్నారు