ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్:
యువతే దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారినపడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోకూడదని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రామగుండం ట్రాఫీక్ ఏఎస్ఐ మల్లారెడ్డి అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు, నెహ్రూ యువ కేంద్రం పెద్దపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ట్రినిటి డిగ్రి కళాశాల స్టూడెంట్స్ కు మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.యువతే దేశ భవిష్యత్తు అని, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారినపడి ఉజ్వల భవిష్యత్తును కోల్పోకూడదనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పారు.చట్టాలను గౌరవించి వాటిని పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.అనంతరం ప్రోగ్రాంలో పాల్గొన్న స్టూడెంట్స్ కు సర్టిఫికెట్స్ అందజేశారు.ఎన్ వైపి తెలంగాణా స్టేట్ ప్రెసిడెంట్ కె యాదవరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో షీంటీం ఇన్ చార్జ్ స్నేహలత,సురేష్,కళాశాల ప్రిన్సిపాల్ యుగేందర్,ఎన్ ఎస్ఎస్ పివో తాజోద్దిన్,ప్రోగ్రాం ఆర్గనైజర్ సంకల్పా ప్రెసిడెంట్ సాయి శ్రీ,స్టూడెంట్స్ తది తరులు ఉన్నారు.