వనదేవతలకు నీరా‘జనం’

Written by itstruenews.com

Published on:

వనదేవతలకు నీరా‘జనం’
‒ సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న లక్షలాది మంది
‒ నాగులమ్మను కొలిచిన కోయపూజారులు
‒ గోదావరిఖని జాతరకు పోటెత్తిన భక్తులు

రామగుండం,ఇట్స్ ట్రూ న్యూస్

సమ్మక్క, సారలమ్మ తల్లులకు శుక్రవారం భక్తులు నీరాజనం పలికారు. పుణ్య స్నానాలాచరించి బెల్లం, కొబ్బరి కాయలు, కోళ్ళు, మేకలతో వనదేవతలకు మొక్కులు అప్పగించారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క తల్లులు గద్దెపైకి చేరగా, శుక్రవారం గిరిజన దేవతలను తనివితీరా చూసేందుకు భక్తులు బారులు తీరారు. మేడారం జాతరకు వెళ్ళిన వారు కూడా గోదావరిఖనిలో జరుగుతున్న జాతరకు పెద్ద ఎత్తున హాజరవుతూ మొక్కులు తీర్చుకున్నారు. కాగా జాతర కమిటి ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ గద్దెలకు సమీపంలో ఉన్న చెట్టు వద్ద నాగులమ్మకు కోయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క, సారలమ్మ తల్లుల వద్ద బండారిని (పసుపు, కుంకుమ) పెట్టి అక్కడి నుంచి కొమ్ము వాయిద్యాలతో పుట్ట వద్దకు వెళ్ళి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మేకలను బలి ఇచ్చి అమ్మవార్లకు నైవేధ్యం పెట్టారు.

Leave a comment