కార్మికులకు మినిమమ్ వేజ్ చెల్లించాలి
జ్యోతినగర్,ఇట్స్ ట్రూ న్యూస్
రామగుండం ఫెర్టీలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్ సిఎల్) కంపెనిలో పని చేస్తున్న కార్మికులకు మినిమమ్ వేజ్ (కనీస వేతనాలు) చెల్లించాలని పెద్దపెల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఐఎఫ్ టీయూ) అధ్యక్షులు ఐ కృష్ణ, ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ అన్నారు.గురువారం హైదరాబాద్ రీజనల్ లేబర్ కమిషనర్(ఆర్ ఎల్ సీ) సునిల్ ను ఆఫీసులో కలిసి ఆయనకు ఐఎఫ్ టీయూ నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బ్యాగర్స్,స్టిక్చర్స్ కార్మికులకు 8గంటల పనిదినాలు ,26 రోజుల పనిరోజులు కల్పించాలని ఆర్ఎఫ్ సిఎల్ యాజమాన్యంకు వివరిస్తే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.యాజమాన్యం విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంత ఐఎఫ్ టీయూ న్యాకత్యంలో పోరాడాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో రాము,శ్రీకాంత్,శ్రావణ్,రూపేష్,తిరుపతి,రాకేష్,సంతోష్ తది తరులు ఉన్నారు